Nenu Velle Margamu|నేను వెళ్ళేమార్గము|Song Lyrics In Telugu

 పల్లవి : నేను వెళ్ళేమార్గము - నా యేసుకే తెలియును 
శోదింప బడిన మీదట - నేను సువర్ణమై మారెదను
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్

1. కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకునా  
గురిలేని తరుణాన వెరవగ - నాదరినే నిలిచేవా నా  ప్రభూ  
||నేను వెళ్ళేమార్గము||

2.జలములలో బడి నే వెళ్లినా - అవి నా మీద పారవు 
అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు 
||నేను వెళ్ళేమార్గము||

3.విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభూ
సాతాను సుడిగాలి రేపగా - నాయెదుటేనిలిచేవా నా ప్రభూ 
||నేను వెళ్ళేమార్గము||

Post a Comment

0 Comments