పల్లవి : నా ప్రియుడా యెసయ్యా - నీ కృప లేనిదే నే
బ్రతుకలేను
క్షణమైనా నే బ్రతుకలేను||నా ప్రియుడా||
1.నీ చేతితోనే నను లేపినావు -
నీ చేతిలోనే నను చెక్కుకొంటివి
నీ చేతి నీడలో నను దాచుకొంటివి
||నా ప్రియుడా ||
2.నీ వాక్కులన్ని వాగ్దానములై -
నీ వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి
నీ వాగ్దానములు మార్పులేనివి
||నా ప్రియుడా ||
3. ముందెన్నడూ నేను వెళ్ళనీ -
నూతనమైన మార్గములన్నిటిలో
నా తోడు నీవై నన్ను నడిపినావు
||నా ప్రియుడా ||
4. సర్వోన్నతుడా సర్వకృపానిధి -
సర్వసంపదలు
నీలోనే యున్నవి
నీవు నా పక్షమై నిలిచి యున్నావు
||నా ప్రియుడా ||
0 Comments