పల్లవి : స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా
స్తుతులందుకో - పూజార్హుడా
ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు
1.నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ
నాలో కృంగెనే ప్రభూ
నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే - శత్రుల
చేతినుండి
విడిపించినావు - కాపాడినావు
||స్తుతి పాత్రుడా||
2.నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన
నిలిచేరు నా ప్రభూ
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నను నిల్పెను
నీ సన్నీధిలో - నీ సంఘములో ||స్తుతి పాత్రుడా||
0 Comments