Yeguruchunnadhi | ఎగురుచున్నది విజయ | Song Lyrics In Telugu

 పల్లవి : ఎగురుచున్నది విజయ పతాకం 
యేసు రక్తమే మా జీవిత విజయం

రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును 
సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును 
రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే 
రక్తమే జయం - యేసు రక్తమే జయం

1.యేసునినామం ఉచ్చరింపగనే 
సాతాను సైన్యము వణుకు చున్నది 
వ్యాధుల బలము నిర్మూలమైనది 
జయం పొందెడి నామము నమ్మినప్పుడే||రక్తమే||

2. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం 
ఎడతెగకుండగ మనము స్మరణచేయుదం 
పాపపు క్రియలన్నిటిని చెదర గొట్టిన 
క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం||రక్తమే||

3.మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా 
ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా 
నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను 
స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే||రక్తమే||

Post a Comment

0 Comments