నా ప్రియునికి నే స్వంతమెగా
నా ప్రియుడు నా వాడు
1. మరణపు ముల్లును నా లో విరిచి
మారాను మధురం గా చేసి
మనస్సును మందిరము గా మార్చే ||నా ప్రియుడు ||
2.కృపనే ధ్వజముగా నాపై నెత్తి
కృంగిన మదిని నింగి కెత్తి
కృపతో పరవశ మొందించే ||నా ప్రియుడు ||
3. సంఘముగా నను చేర్చుకొని
సంపూర్ణ నియమములన్నియును
సంగీతముగా వినిపించే ||నా ప్రియుడు ||
4. జీవితమే జలరేఖలుగా
చెదిరిన సమయములన్నింటిలో
పిలుపును స్థిరపరచే కృపలో ||నా ప్రియుడు||
5.సంబరమే యేసు కౌగిలిలో
సర్వాంగ సుందరుడై వచ్చువేళ
సమీపమాయే ఆ శుభవేళ ||నా ప్రియుడు||
0 Comments