నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా!
1.నీ వాక్యమే నా పరవశము
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము ||2||
నీ వాక్యమే నా పాదములకు దీపము ||3|| ॥ నా స్తుతి పాత్రుడా ॥
2.నీ కృపయే నా ఆశ్రయము
నీ కృపయే నా ఆత్మకు అభిషేకము ||2||
నీ కృపయే నా జీవన ఆధారము ||3|| ॥ నా స్తుతి పాత్రుడా ॥
3.నీ సౌందర్యము యెరూషలేము
నీ పరిపూర్ణత సీయోను శిఖరము ||2||
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము ||3||॥ నా స్తుతి పాత్రుడా ॥
0 Comments