నా కృప నిన్ను విడువ దనినా
1. మనోనేత్రములు వెలిగించినందున - యేసు పిలిచిన
పిలుపును క్రీస్తు మహిమేశ్వర్య మెట్టిదో-పరిశుద్ధులలో చూపితివే ||కృప||
2. జలములలో బడి వెళ్ళునపుడు - అలలవలె అవి పొంగి రాగా
అలల వలే నీ కృపతోడై - చేర్చెను నన్ను ఈ దరికి
||కృప||
3.భీకర రూపము దాల్చిన లోకము - మ్రింగుటకు నన్ను సమీపించగా
ఆశ్చర్యకరములు ఆదుకొని అందని కృపలో దాచెనుగా ||కృప||
4. సేవార్థమైన వీణెలతో నేను - వీణెలు వాయించు వైణికులున్నా
సీయోను కొరకే జీవించుచూ- సీయోను రాజుతో హర్షించేదను ||కృప||
5. నీదు వాక్యము - నా పాదములకు - నిత్యమైన వెలుగై యుండున్
నా కాలుజారె ననుకొనగా - నిలిపెను నన్ను నీ
కృపయే ||కృప||
0 Comments