1.ఏ యోగ్యత లేని నన్ను
నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా
నన్నెంతగానో ప్రేమించినావు
నీ ప్రాణమిచ్చావు నాకై || ప్రేమమయా ||
2. ఎదవాకిటను నీవు నిలచి
నా హృదయాన్ని తట్టావు ప్రభువా హృదయాంగణములోకి అరుదెంచినావు
నాకెంతో ఆనందమే|| ప్రేమమయా ||
3. శోధనలు నను చుట్టుకొనినా
ఆవేదనలు నను అలుముకొనినా
శోధన, రోదన ఆవేదనలో
నిన్నే స్తుతింతును ప్రభువా || ప్రేమమయా ||
0 Comments