30. Anandhame Prabhu Yesuni Song Lyrics

పల్లవి : ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడెద

1.సిలువలో నాకై రక్తము కార్చెను 
సింహాసనమునకై నన్నును పిలిచెను 
సింహపుకోరల నుండి నన్ను విడిపించెను ||ఆనందమే||

2.విశ్వాసమును కాపాడుకొనుచూ 
విజయుడైన యేసుని ముఖమును చూచుచూ విలువైన కిరీటము పొందెద నిశ్చయము ||ఆనందమే||

3.నా మానస వీణను మ్రోగించగా 
నా మనో నేత్రములందు కనిపించె ప్రభు రూపమే 
నా మదిలోన మెదిలేను ప్రభు సప్తస్వరాలు ||ఆనందమే|||

Post a Comment

0 Comments