పల్లవి : హల్లెలూయా -యేసయ్యా
హల్లెలూయా -యేసయ్యా మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు
1. యెహోషువా ప్రార్థించగా - సూర్య చంద్రులను నిలిపావు
దానియేలు ప్రార్థించగా - సింహపు నోళ్లను మూసావు మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు ||హల్లెలూయా||
2. మోషే ప్రార్థించగా - మన్నాను కురిపించావు ఏలియా ప్రార్థించగా - వర్షమును కురిపించితివి మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు ||హల్లెలూయా||
3. పౌలుసీలలు స్తుతించగా - చెరసాల పునాదులు కదిలించావు
ఇశ్రాయేలు స్తుతించగా - యెరికో గోడలు కూల్చావు మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు ||హల్లెలూయా||
0 Comments