పల్లవి : తేజోవాసుల స్వాస్థ్యమందు - నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా
1.అగ్నిలో పుటము వేయబడగా - నాదు విశ్వాసము
శుద్ధ సువర్ణమగునా - నీదు రూపు రూపించబడునా
|| తేజో ||
2. రాబోవు యుగములన్నిటిలో - కృపా మహదైశ్వర్యం కనుపరచే నిమిత్తమేనా - నన్ను నీవు ఏర్పరచితివా || తేజో ||
3. శాపము రోగములు లేని - శాశ్వత రాజ్యము శాపవిముక్తి పొందిన – శాంతమూర్తుల - స్వాస్థ్యమదేనా || తేజో ||
4.నటనలు నరహత్యలు లేని - నూతన యెరూషలేం అర్హతలేని నన్నును - చెర్చుటయే నీ చిత్తమా
|| తేజో ||
0 Comments