20. Prabhuva Neelo Jeevinchuta Song Lyrics

పల్లవి : ప్రభువా నీలో జీవించుట 
కృపా బాహుల్యమే
నా యెడ కృపా బాహుల్యమే

1.సంగీతములాయె
పెను తుఫానులన్నియు (2) 
సమసిపోవునే నీ నామ స్మరణలో (2) 
సంతసమొందె నా మది యెంతో (2)
||ప్రభువా||

2.పాప నియమమును బహు దూరముగా చేసి (2) పావన ఆత్మతో పరిపూర్ణమైన (2) 
పాద పద్మము హత్తుకొనెదను (2)
||ప్రభువా||

3.నీలో దాగినది
కృప సర్వోన్నతముగా (2)
నీలో నిలిచి కృపలనుభవించి (2) 
నీతోనే యుగయుగములు నిల్చెద (2)
||ప్రభువా||

4. నూతన వధువునై
శుద్ధ వస్త్రములు ధరించి (2) 
నూతనమైన శుభాకాంక్షలతో (2)
నూతన షాలేమై సిద్దమౌదు నీకై (2) ||ప్రభువా||

Post a Comment

0 Comments