19. Vandhanamu Neeke Vandhanamu song lyrics

పల్లవి : వందనము నీకే నా వందనము (2) 
వర్ణనకందని నీకే నా వందనము (2)

1.నీ ప్రేమ నేనేల మరతు
నీ ప్రేమ వర్ణింతునా (2) 
దాని లోతు ఎత్తునే గ్రహించి (2) 
నీ ప్రాణ త్యాగమునే తలంచి (2) ॥వందనము॥

2. సర్వ కృపానిధి నీవే 
సర్వాధిపతియును నీవే (2) 
సంఘానికి శిరస్సు నీవే (2) 
నా సంగీత సాహిత్యము నీవే (2) ॥వందనము॥

3. పరిశుద్ధమైన నీ నామం 
పరిమళ తైలము వలె (2) 
పరము నుండి పోయబడి (2) 
పరవశించి నేను పాడెదను (2) ॥వందనము॥

4.మృతి వచ్చెనే ఒకని నుండి 
కృప వచ్చెనే నీలో నుండి (2) 
కృషి లేక నీ కృప రక్షించెను (2) 
కృతజ్ఞతార్పణలర్పింతును (2) ॥వందనము॥

5.తండ్రియైన దేవునికే కుమారుడైన దేవునికే (2) పరిశుద్ధాత్మ దేవునికే (2) 
వందన వందన వందనము (2) ॥వందనము॥

Post a Comment

0 Comments