17.Na Jeevam Nee Krupalo song lyrics

పల్లవి : నా జీవం నీ కృపలో దాచితివే - 
నా జీవితకాలమంతా
ప్రభువా నీవే నా ఆశ్రయం - నా ఆశ్రయం 

1.కానాను యాత్రలో యోర్దాను అలలచే 
కలత చెందితినే కాపరివైన నీవు 
దహించు అగ్నిగా నా ముందు నడిచితివే ॥ నా జీవం ॥

2.వాగ్దానా భూమిలో మృతసముద్రపు 
భయము నన్ను వెంటాడెనే 
వాక్యమైయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే
॥ నా జీవం ॥

3.స్తుతుల మధ్యలో నివసించువాడా 
స్తుతికి పాత్రుడా స్తుతియాగాముగా 
నీ సేవలో ప్రాణార్పణ చేతునే ॥ నా జీవం ||

Post a Comment

0 Comments