51 | ఏ తెగులు నీ గుడారమున్ | Ae tegulu nee gudaramun samipinchadaya | Christhu Jyothi Ministries

పల్లవి: ఏ తెగులు నీ గుడారమున్ - సమీపించదయ్యా 
అపాయమేమియు రానే రాదు - రానేరాదయ్యా 
లలలా - లలలా - లలలా ॥2॥

1. ఉన్నతమైన దేవుని నీవు - నివాసముగా గొని 
ఆశ్రయమైన దేవుని నీవు - ఆ ధైర్య పరచితివి ॥2॥॥ఏ తెగులు॥

2. గొర్రెపిల్ల రక్తముతో - సాతానున్ జయించితివి 
ఆత్మతోను వాక్యముతో - అనుదినం జయించెదము ॥2॥॥ఏ తెగులు॥

3. దేవుని కొరకై మన ప్రయాసములు - వ్యర్థముకానే కావు 
కదలకుండా - స్థిరముగా ప్రయాసపడెదము ॥2॥॥ఏ తెగులు॥

4. మనయొక్క నివాసము - పరలోకమందున్నది 
రానైయున్న రక్షకుని - ఎదుర్కొన కనిపెట్టెదం॥2॥॥ఏ తెగులు॥





Post a Comment

0 Comments