హల్లెలూయ పాటలతో స్తోత్ర గీతాలతో / Halleluya Patalatho Sthotra Geethalatho / Song Lyrics

 హల్లెలూయ పాటలతో స్తోత్ర గీతాలతో ||2||
హోసన్నా నిన్నే పాడనా
యేసన్నా నిన్నే చేరనా ||2|| హల్లెలూయా హల్లెలూయా హోసన్న ||2|| 1.నిన్ను చేరగానే - నన్ను నేను మరచి తేనెవంటి మాటలలో - లీనమైతిని ||2|| నీ నోటి మాటలు ఏనాటికైనా - మరువను యేసయ్యా ||2|| 2.నిన్ను పాడగానే - బంధకాలు తొలిగే నాకున్న సంకెళ్ళు - విడిపోయెనే ||2|| ఏ చోటనైనా నీ పాటలే నేను - పాడెదా యేసయ్యా ||2|| 3.నిన్ను చూడగానే - నా మదిలోన ఎనలేని ఆనందము పొంగిపొర్లేనే ||2|| నా హృదయములో నీ ప్రేమనాథం - వినిపించు యేసయ్యా ||2||

Post a Comment

0 Comments