Antyadinamandhu Dootha / అంత్యదినమందు దూత / Christhu Jyothi Ministries Songs

1. అంత్యదినమందు దూత - బూరసూదుచుండగా నిత్యవారసంబు 
తెల్లవారగా-రక్షణంధుకొన్నవారి - పేళ్ళు పిల్చుచుండగా నేను కూడ - చేరియుందునచ్చటన్

పల్లవి: నేను కూడ - చేరియుందున్ - 
నేను కూడ - చేరియుందున్ 
నేను కూడ - చేరియుందున్ 

2. క్రీస్తునందు మృతులైన - వారు లేచి క్రీస్తుతో 
పాలుపొందునట్టి యుదయంబునన్-భక్తులారా కూడి రండి 
యంచు బిల్చుచుండగా-నేను కూడ చేరియుందు నచ్చటన్ ||నే||

3. కానయేసు సేవ ప్రత్య-హంబు చేయుచుండి నే - 
క్రీస్తునద్భుతంపు ప్రేమ చాటుచు - కృపనొందు వారి పేళ్ళు-యేసు పిల్చు 
చుండగా - నేను కూడ చేరియుందు నచ్చటన్  ||నే||

Post a Comment

0 Comments