67 | O Prabhuva | ఓ ప్రభువా | Calvary Temple

పల్లవి: ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే 
నా మంచి కాపరివి - నీవే నా మంచి కాపరివి

1. దారి తప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి 
నిత్యజీవము నిచ్చిన దేవా - నీవే నా మంచి కాపరివి ॥2॥

2. నీవు ప్రేమించిన గొట్టెలన్నిటిని - ఎల్లప్పుడు చెయ్యివిడువక 
అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి॥ఓ॥

3. ప్రధాన కాపరిగా నీవు నాకై - ప్రత్యక్షమగు ఆ ఘడియలో 
నన్ను నీవు మరువని దేవా - నీవే నా మంచి కాపరివి ॥ఓ॥

Post a Comment

0 Comments