32 | Simhapu Pillalu Aakaliginunu | సింహపు పిల్లలు ఆకలిగొనును | Calvary Temple

పల్లవి: సింహపు పిల్లలు ఆకలిగొనును - దేవుని వెదకు వారికి కొదువలేదు
కొదువలేదు కొదువ లేదు - దేవుని వెదకు వారికి కొదువలేదు.

1. పచ్చికగల చోటులందు - పరుండజేయును నన్ను (2) 
శాంతి కరంబగు జలములచే - దాహము తీర్చునుగా (2)

2. బలహీన మగునపుడు - నా క్రీస్తే నా బలమై (2) 
నా కృప నీకు చాలనెను - నను ఓదార్చెనుగా (2)

3. తన మహిమై శ్వర్యముచే నను ప్రభు నింపునుగా (2) 
నా కొరతలెల్ల క్రీస్తునందు- నిరతము తీర్చునుగా (2)

Post a Comment

0 Comments