పల్లవి: దాగున్నావా నీవు దాగున్నావా - సంఘాన్ని చెడిపేవాడా
నీవు నా కనులను దాయగలవు గానీ
ఆ దేవుని కళ్ళను దాయలేవుగా
1. పలుకుతావు నీవు పరిశుద్ధ మాటలు
చేస్తావు నీవు సాతాను క్రియలు ॥2॥
ఈ లోకపు దృష్టిలో పరిశుద్ధుడవైనా
పరలోకంలో నీ స్థానమేమిటో॥దాగున్నావా॥
2. తోటివానిపైన నీకెందుకయ్య కోపం
ఆ కోపం పైవానికి ఎందుకయ్య భారం ॥2॥
నీ కాలం చెల్లునాడు నీతోడు రాడు
ఎందుకయ్య నీకింకా వానితో గోడు ॥దాగున్నావా॥
3. పాడు పదవిపైనా నీకెందుకయ్య మోహం
ఆ మోహంలో బ్రతుకు బలౌతుంది ఖాయం ॥2॥
పదవి అనే పదనిసలో ప్రభుని మరచినావో
పరలోకంలో నీ పేరు మాయమౌను ॥దాగున్నావా॥

0 Comments