ఆపత్కాలమందు దాగుచోటది
మనవులు అన్నియు ఆలకించిన
వినయముగలవారికి ఘనతనిచ్చిన
నీ సింహాసనమును స్థాపించుటకు
నీవు కోరుకున్న సన్నిధానము
ఎంత మధురము నీ ప్రేమ మందిరం
పరవశమే నాకు యేసయ్య
1. విసిగిన హృదయం కలవరమొంది
వినయము కలిగి నిన్ను చేరగ
పరమందుండి నీవు కరుణచూపగా
లేత చిగురుపైన మంచు కురియు రీతిగా
ప్రేమను చూపి బాహువు చాపి
నీలో నన్ను లీనము చేసిన
ప్రేమసాగరా జీవితాంతము
నీ సన్నిధిని కాచుకొందును
2. లెక్కించలేని స్తుతులతో నీవు
శాశ్వతకాలము స్తుతినొందెదవు
మహిమతో నీవు సంచరించగా
ఏడు దీప స్థంబములకు వెలుగు కలుగగా
ఉన్నతమైన ప్రత్యక్షతను
నే చూచుటకు కృపనిచ్చితివి
కృపా సాగరా వధువు సంఘమై
నీకోసమే వేచియుందును
3.సీయోను శిఖరమే నీ సింహాసనము
శుద్ధులు నివసించు మహిమ నగరం
శుద్ధులు నివసించు మహిమ నగరం
ఎవరు పాడలేని క్రొత్త కీర్తన
మధురముగా నీయెదుట నేను పాడెద
సౌందర్యముగా అలంకరించిన
నగరములోనే నివసించెదను
ప్రేమపూర్ణుడా మహిమాన్వితుడా
నీతోనే రాజ్యమేలెదా
0 Comments