Sthuthipadutake brathikinchina
జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నన్ను పోషించినా
తల్లివలె నన్ను ఓదార్చినా
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా !!2!!
జీవితకాలమంతా - ఆధారం నీవేనయ్యా
నా జీవిత కాలమంత- ఆరాధించి ఘనపరతును
1. ప్రాణభయమును తొలగించినావు -
ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప -
దీర్ఘాయువుతో నను నింపినావు !! 2 !!
నీ కృపా బాహుళ్యమే-వీడని అనుబంధమై
తలచిన ప్రతికణమున - నూతన బలమిచ్చెను !! స్తుతి !!
2. నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు -
కనుమరుగాయెను నా దుఖ:దినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు
లోకములోనుండి ఏర్పరచినావు !! 2 !!
నీ దివ్య సంకల్పమే - అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై - నిరీక్షణ కలిగించెను !! స్తుతి !!
3.హేతువులేకయే ప్రేమించినావు -
వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు
నా చేయి విడువక నడిపించినావు !! 2 !!
నీ ప్రేమ మాధుర్యమే - నా నోట స్తుతిగానమై
నిలిచిన ప్రతిస్థలమున - పారెను సెలయేరులై. !!స్తుతి!!
0 Comments