Naa dhaaguchotu neeve
నా విచారములు కొట్టివేసి
ఆనందము కలుగజేసితివి
నా హృదయములో నదివలె సమాధానమే
నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే
1. తగిన సమయములో హెచ్చించునట్లు
నను దాచి కాచితివి
దీనమనసు కలిగి జీవింప
నీ కృప నిచ్చితివి
నా చింతలన్ని బాపి నీ శాంతితో నింపితివి
2. ఆపత్కాలములో పర్ణశాలలో
నను నీవు దాచితివి
నా సహాయకుడ నీవని
నే నాట్యమాడి కీర్తింతును
నా జీవితకాలమంతయు
నీ సన్నిధిని నివసింతును
3. అగ్ని శోధనలు నను చుట్టుకొనగా
దాచితివి నీ కౌగిలిలో
స్నేహబంధముతో బంధించి
నను ప్రేమించితివి
జేష్టుల సంఘముకై నను సిద్ధపరచితివి
0 Comments