పల్లవి : సీయోనులో నుండి నీవు -
ప్రకాశించుచున్నావు నాపై ||2||
సమాధానమై - సదాకాలము నను నీతో
నడిపించుచున్నావు నీకీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా ||2||
1. నిర్దోషమైన మార్గములో -
నా అంతరంగమున ధైర్యమునిచ్చి ||2||
నీ సన్నిధిలో ననునిలిపి -
ఉన్నత విజయమునిచ్చితివి ||2||
నీ ఆశలు నెరవేరుటకు - నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు
| |సీయోనులో॥
నా అంతరంగమున ధైర్యమునిచ్చి ||2 ||
నీ సన్నిధిలో ననునిలిపి -
ఉన్నత విజయమునిచ్చితివి ||2||
నీ ఆశలు నెరవేరుటకు - నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు
||సీయోనులో||
2. నాయందు దృష్టినిలిపి -
నీస్నేహబంధముతో ఆకర్షించి||2||
కృపావరములతో ననునింపి -
సత్యసాక్షిగా మార్చితివి||2||
నీ మనస్సును పొందుకొని - నీ ప్రేమను నింపుకొని
క్రీర్తించెదను పతినిత్వం
నీ మాటల మకరందమును మరపురాని
అనుబంధమును
మరువను ఎన్నడు విడువను
నేను మరువను ఎన్నడు విడువను
||సీయోనులో||
0 Comments