సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం - నా ప్రాణం - నీవే యెసయ్యా
1.ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంఖెళ్ళైన శత్రువు కరుణించువాడవు నీవే
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా ॥సర్వ॥
2.స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శ్రుంగధ్వనులతొ సైన్యమును నడిపించువాడవు నీవే
నీయందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణమును గెలిచిన బహుధీరుడా ॥సర్వ॥
3.కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహుతరములకు శొభాతిశయముగా జేసితివి నన్ను
నెమ్మది కలింగించే నీ బాహుబలముతొ
శతృవునణచిన బహుశూరుడా ॥సర్వ॥
0 Comments