188 Aaradhana Sthuthi / ఆరాధన స్తుతి ఆరాధన / Hosanna Ministries Songs


పల్లవి : ఆరాధన స్తుతి ఆరాధన
 ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన

తండ్రియైన దేవా-కుమారుడైన ప్రభువా - పరిశుద్దాత్మ
 దేవా 
త్రియేక దేవా ఆరాధన స్తుతి ఆరాధన

1.సర్వసృష్టికి ఆధారుడా-సకలజీవుల పోషకుడా
 సీయోనులోనుండి దీవించువాడవు 
సదాకాలము జీవించువాడవు
 సాగిలపడినే నమస్కరించి
 సర్వదా నిను కొనియాడేద-నిన్నే కీర్తించెద
 || తండ్రియైన ||

2.సార్వత్రిక సంఘస్థాపకుడా-సర్వలోక రక్షకుడా
 సిలువలో నీ రక్తమే నాకై కార్చితివి 
శిథిలము కాని నగరమును కట్టితివి
స్తోత్రము చెల్లింతు నీ కీర్తి తలచి
సర్వలోకాన నీమహిమను నేను ప్రకటింతును
 || తండ్రియైన ||

3.సర్వసత్యమునకు ఆధారమై-పరిశుద్ధయాజకుల
 సారధివై 
యాజక రాజ్యములో నను చేర్చుటకై
నిత్యయాజకత్వమును ధరింపజేసితివి
మహిమతో పరిచర్య నే చేయుటకై
నూతన కృపలను నే పొందెద-ఆత్మతో శక్తితో
 || తండ్రియైన ||

Post a Comment

0 Comments