187 Vijayashiludaa Naa Pranaa / విజయశీలుడా నా ప్రాణ / Hosanna Ministries Songs


పల్లవి : విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా
 కృతజ్ఞతతో నిను స్తుతించెదను ||2||
 నా యేసయ్యా నిను వేడుకొనగా
 నా కార్యములన్నియు సఫలము చేసితివి ||2||

1. అలసిన సమయమున 
నా ప్రాణములో త్రాణ పుట్టించినావు ||2|| 
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి
 ధైర్యముతో నింపినావు ||2|| 
నిత్యానందము కలిగించే నీ
 శుభ వచనములతో నెమ్మదినిచ్చితివి ||2||
 || విజయశీలుడా ||

2.ఆశ్చర్యకరముగ నీ బాహువు చాపి
 విడుదల కలిగించినావు ||2|| 
అరణ్య మార్గమున విడువక తోడై
 విజయముతో నడిపినావు ||2||
 నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి 
వాగ్ధాన భూమిలో చేర్చిన దేవా ॥2॥
 || విజయశీలుడా ||

3.ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో
 ఆశ్రయమిచ్చితివి నాకు ||2||
 అక్షయుడా నా సంపూర్ణతకై
మహిమాత్మతో నింపినావు ||2||
 నిత్యము నీతో నేనుండుటకై
 నూతన యెరూషలేము నిర్మించుచున్నావు ||.
 || విజయశీలుడా ||

Post a Comment

0 Comments