పల్లవి : యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు
నిలయుడా
నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము
1.నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి
సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే
|| యేసయ్య ||
2.నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు
వాడవు
దాహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి
ఆలసినవారి ఆశను తృప్తిపరచితివి
అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము
|| యేసయ్య ||
3.నీ వలన బలమునొందిన వారే ధన్యులు
నీ సన్నిధియైన సీయెనులో వారు నిలిచెదరు
నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు
నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు
|| యేసయ్య ||
0 Comments