పల్లవి: నమ్మదగిన వాడవు సహయుడవు యేసయ్య
ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్య
చెర నుండి విడిపించి చెలిమితొ బంధించి
నడిపించినావె మందవలె నీ స్వాస్థ్యమును
1.నీ జనులకు నీవు న్యాయధిపతివైతివే
శత్రువుల కోటలన్ని కూలిపోయెను
సంకేళ్ళు సంబరాలు ముగబోయెను
నీరిక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు
నిత్యానందభరితులే సియోనుకు తిరిగివచ్చెను
|| నమ్మదగిన ||
2.నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి
జఠిలమైన త్రోవలన్ని దాటించితివి
సమృద్ధి జీవముతో పోషించితివి
ఆలోచన కర్తవైన నీ స్వరమే వినగా
నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను
|| నమ్మదగిన ||
3.నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి
యోగ్యమైన దాసునిగ మలచుకొంటివి
అర్హమైన పాత్రగనను నిలుపుకొంటివి
ఆదరణ కర్తవై విడువక తోడైనిలిచి
సర్వోత్తమమైన మార్గములో నడిపించుము
|| నమ్మదగిన ||
0 Comments