పల్లవి : నా ఆత్మీయ యాత్రలో ఆరణ్య మార్గములో
నాకు తోడైన యేసయ్యా నిను ఆనుకొని జీవించెద
నేనేల భయపడను నా వెంట నీవుండగా
నేనెన్నడు జడియను నా ప్రియుడా నీవుండగా
1.శ్రేష్టమైన నీ మార్గములో నిత్యమైన నీ
బాహువుచాపి
సమృద్ధి జీవము నాకనుగ్రహించి నన్ను బలపరచిన
యేసయ్య
నిన్ను హత్తుకొనగా నేటివరకు నేను సజీవుడను
|| 33 ||
2.పక్షిరాజువలె పైకెగురుటకు నూతన బలముతో
నింపితిని
జేష్ఠుల సంఘములో నను చేర్చి పరిశుద్ద పరిచే
యేసయ్యా
అనుదినము నిన్ను స్తుతించుటకు నేని జీవింతును
|| 33 ||
3.సేయోను దర్శనము పొందుటకు ఉన్నత
పిలుపుతో పిలిచితిని
కృపావరముతో నను నింపి అలంకరిస్తున్న
యేసయ్యా
నీ రాక కొరకు వేచియుంటిని త్వరగా దిగిరమ్ము
|| 33 ||
0 Comments