ఆనందముతో - దినదినము - సంతోషముతో నుందురు ॥
1. వాడబారని ఆకువలె - దినదినము బలమొందెదరు
జీవజలముల నది యొడ్డున - వృక్షములవలె పెరిగెదరు.
ఆ... హల్లెలూయ... ఆ ఆ ఆ... హల్లెలూయ ॥యేసుని॥
2. చీకటి నుండి - వెలుగునకు - మరణమునుండి - జీవమునకు
చేయి విడువక - తనతో కూడ - యేసే - నడిపించును.
ఆ... హల్లెలూయ... ఆ ఆ ఆ... హల్లెలూయ ॥ ॥యేసుని॥
3. చీకు చింతలు కలిగినను - చెరలో దుఃఖము కలిగినను ॥
కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును
ఆ... హల్లెలూయ... ఆ ఆ ఆ... హల్లెలూయ ॥ ॥యేసుని॥
4. నడిసముద్రము పయనించినా - నట్టడవులలో నివసించినా
ఎన్నడు మరువక ఎడబాయక - యేసే తోడుండును
ఆ... హల్లెలూయ... ఆ ఆ ఆ... హల్లెలూయ ॥ ॥యేసుని॥
0 Comments