ధవళవర్ణుడా – మనోహరుడా రత్న వర్ణుడా నా ప్రియుడా ॥సుత్తి॥
1. ఆరాధించెద అరుణోదయమున - అమరుడ నిన్నే ఆశ తీర
ఆశ్రిత జనపాలకా అందుకో నా స్తుతి మాలిక
ధవళ వర్ణుడా మనోహరుడా రత్న వర్ణుడా నా ప్రియుడా ॥సుత్తి॥
2. గురిలేని నన్ను ఉరినుండి లాగి - దరిచేర్చి నావే పరిశుద్ధుడా
ఏమని పాడెద దేవా - ఏమని పొగడెద ప్రభువా
ధవళ వర్ణుడా మనోహరుడా రత్న వర్ణుడా నా ప్రియుడా ॥సుత్తి॥
3. మతిలేని నన్ను శృతిచేసినావే - మృతినుండి నన్ను బ్రతికించినావే
నీలతనై పాడెదదేవా నా పతివని పొగడెద ప్రభువా
ధవళ వర్ణుడా - మనోహరుడా - రత్నవర్ణుడా నా ప్రియుడా ॥స్తుతి||
0 Comments