Aparadhini Yesayya | అపరాధిని యేసయ్యా | Song Lyrics |Athmiya Geethalu

ప॥ అపరాధిని యేసయ్యా - కృపజూపి బ్రోవుమయ్యా 
నెపమెంచకయె నీ కృపలో - నపరాధములను క్షమించు.

1. సిలువకు నిను గొట్టితిని - తులువలతో జేరితిని (2) 
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా (2)

2. ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే (2) 
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితివయ్యా (2)

3. ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి (2) 
నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ (2)

4. దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావనిడితి (2) 
ద్రోహుండనై జేసితిని - దేహంబు గాయంబులను (2)

5. ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని (2) 
క్రూరుండనై గొట్టితిని - ఘోరంపు పాపిని దేవా (2)

6. చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బలచేత (2) 
నిందలు పెట్టితివయ్యో - సందేహ మేలనయ్యా (2)

7. శిక్షకు పాత్రుడనయ్యా - రక్షణ దెచ్చితివయ్యా (2) 
అక్షయ భాగ్యము నియ్య - మోక్షంబు జూపితివయ్యా (2)

Post a Comment

0 Comments