Adigo Anjuramu | అదిగో అంజూరము | Song Lyrics | Athmiya Geethalu

అదిగో అంజూరము - ఓ క్రైస్తవ చిగురించెను చూడుము 
ఇదిగో నేను త్వరగా వత్తును
సిద్ధపడుడి అను స్వరము వినవా

1. నూట ఇరువది సంవత్సరములు 
చాటెను నోవహు దేవుని వార్తను - 2 
పాటించక ప్రభు మాటలు వారలు - 2 
నీటిలో మునిగిరి పాఠము మీకిది  ||అదిగో||

2. జ్ఞాపక ముంచుము లోతు సతీమణి 
శాప నగర ప్రియ స్నేహితురాలు - 2 
ఆపద నెరిగియు ఆశలు వీడకణ - 2 
నాశనమొందెను పాఠము మీకిది ||అదిగో||

Post a Comment

0 Comments