172 Kavulakaina Sadyama | కవులకైనా సాధ్యమా | Athmiya Geethalu

ప: కవులకైనా సాధ్యమా - నీ కృపను వర్ణించడం 
ప్రేయసికైనా సాధ్యమా - నీ ప్రేమను వర్ణించడం 
శిల్పికైనా సాధ్యమా - నీలా నిర్మించడం 
రాజుకైనా సాధ్యమా - నీలా వరమియ్యడం (2)

1. చెదరిన మనస్సులకు శాంతి - కృంగిన హృదికి ఓదార్పు 
మృత్యు దేహముకు జీవం - బలహీనులకు ఆరోగ్యం (2) 
పరమ వైద్యునిగా నీవు చేసే - స్వస్థత కార్యాలు 
గాయపడిన నీ హస్తం - అద్భుత కార్యాలు 
మోసపూరిత ఈలోకంలో - ఏ వైద్యునికి సాధ్యము (2) ॥కవుల॥

2. క్షణికమైన అనురాగాలు - ఆవిరి వంటి ఆప్యాయతలు 
అవసరాల అభిమానాలు నిలిచిపోయే అనుబంధాలు (2) 
నవ్యకాంతుల మయమైన - నీదు కల్వరి ప్రేమ 
ఆనంద రగిలించే - నీదు నిర్మల స్నేహం 
స్వార్థపూరిత ఈలోకంలో - ఏ మిత్రునికి సాధ్యము (2) ॥కవుల॥

Post a Comment

0 Comments