163 | Aalayamlo Praveshinchandi | ఆలయంలో ప్రవేశించండి | Athmiya Geethalu

ప: ఆలయంలో ప్రవేశించండి అందరు
స్వాగతం సుస్వాగతం యేసునామంలో 
నీ బ్రతుకులో పాపమా.... కలతలా - నీ హృదయంలో 
బాధల కన్నీరా - నీకన్నీరంతా తుడిచివేయు రాజు యేసుకోసం ॥ ఆల॥

1. దీక్షస్వభావంతో త్యాగస్వభావమై వెదికేవారికంత కనబడుదీపమై 
యేసురాజు మాటలే వినుట ధన్యము
వినుటవలన విశ్వాసం అధికమధికమై 
ఆత్మలో దాహము తీరును రారండి ఆనందం 
ఆనందం ఆనందం హల్లెలూయ ॥ ఆల॥

2. ప్రభు యేసు మాటలే పెదవిలో మూటలై 
జీవవృక్షంబుగా ఫలియించాలని 
పెదవితో పలికెదం - మంచిమాటలే 
హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే
నింపెదం నిండెదం కోరెదం
పొందెదం - ఆనందం ఆనందం హల్లెలూయ॥ ఆల॥

Post a Comment

0 Comments