145 Asrayadurgamu Neevani|ఆశ్రయదుర్గము నీవని|Song Lyrics

పల్లవి : ఆశ్రయదుర్గము నీవని 
రక్షణ శృంగము నీవేనని 
నా దాగుచోటు నీవేనని 
నా సమస్తమును నీవేనని

1.నా మార్గములన్నింటిలో చీకటి అలుముకొననివ్వక 
నీ వెలుగుతో కప్పినావు - నీ తేజస్సుతో నింపినావు 
మరణాంధకారములో బంధించబడిన నీ జనులను 
మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకొన్నావు || ఆశ్రయ ||

2.నీ ప్రభావ మహిమాలను నిత్యము ప్రకటించగా 
నీ ఆత్మతో నింపినావు - నా ఆత్మకు తృప్తినిచ్చావు 
కరువు కోరాలలో నలుగుచూ వున్న నీ ప్రజలకు 
ఆకాశవాకిళ్లు తెరచి సమృద్ధిగానే సంపదలిచ్చావు || ఆశ్రయ ||

3.నా విశ్వాస ఓడను బద్దలుకానివ్వక 
నీ చేతితో నిలిపినావు - నీ కౌగిలిలో దాచినావు 
ప్రమాదపు అంచులలో ఊగిసలాడు నీ ప్రియులను 
జ్ఞాప్తికి తెచ్చుకొని సజీవులుగానే దరికి చేర్చావు || ఆశ్రయ ||

Post a Comment

0 Comments