ఎంతో వికారుడాయెన్
1.నా నిమిత్తమే శాపగ్రస్థుడై
ఘోరాసిలువను మోసి వహించెన్
ఈ గొప్పప్రేమ నేను మరువన్ జీవితకాలములో ॥ పదివేలలోని ॥
2.గాయములను శిక్షనిందను
నా శాంతి నిమిత్తమే గదా
నీ శరీరములో పొందితిని నా ప్రియా యేసుదేవా
|| పదివేలలోని ||
3.అన్యాయమైన తీర్పును పొంది
వ్రేలాడేను హీన దొంగల మధ్య
సింహాసనమున నీతో నేనుండి సదా పాలించుటకే
॥ పదివేలలోని ॥
4. మరణము ద్వారా కృప నొసంగి
అక్షయజీవము నిచ్చితివి
మహిమనుండి అధిక మహిమపొంది
మార్పు నొందుటకేగా ॥ పదివేలలోని ॥
5.నీ రూపం చూచి సిలువను మోసి
నీతో నడచి సేవను చేసి
నా ప్రాణము నీకే అర్పింతును
కడవరకు కాపాడుము ॥ పదివేలలోని ॥
0 Comments