94.Siluvalo Aa Siluvalo|సిలువలో ఆ సిలువలో|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా 

వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా

1. నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు 
భారమైన సిలువ మోయలేక మోసావు 
కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు ||వెలియైన||

2.వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె 
మోమున ఉమ్మివేయ మౌనివైనావే 
దూషించి అపహసించి హింసించిరా 
నిన్ను ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా ||వెలియైన||

3. నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్ 
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్
నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం 
సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను 
||వెలియైన||

Post a Comment

0 Comments