110.Nenendhukani Nee Sothuga|నేనెందుకని నీ సొత్తుగా|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున 
నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ

1. నీ పరిచర్యను తుదముట్టించుటే-నా
నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పొందుకోరి - నీ స్నేహితుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము - ఏమని వివరింతును ||నేనెoదుకని||

2. నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే 
నా తనువందున - శ్రమలుసహించి - నీ వారసుడనైతినే 
అహా! నాధన్యత ఓహో! నా భాగ్యము - ఏమని వివరింతును ||నేనెoదుకని||

3. నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే 
పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద 
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము - ఏమని వివరింతును ||నేనెoదుకని||

Post a Comment

0 Comments