104.Na Yesayya Na Sthuthiyagamu| నా యేసయ్యా నా స్తుతియాగము|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యమునై ధూపము వోలె 
నీ సన్నిధానము చేరును నిత్యము 
చేతువు నాకు సహాయము వెనువెంటనే - వెనువెంటనే (2)

1.ఆత్మతోను మనసుతోను 
నేను చేయు విన్నపములు (2) 
ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై 
విజ్ఞాపన చేయుచున్నావా (2) 
విజ్ఞాపన చేయుచున్నావా || నా యేసయ్యా ||

2.ప్రార్థన చేసి యాచించగానే 
నీ బాహు బలము చూపించినావు (2) 
మరణపు ముల్లును విరిచితివా నాకై 
మరణ భయము తొలగించితివా (2) 
మరణ భయము తొలగించితివా || నా యేసయ్యా ||

3.మెలకువ కలిగి ప్రార్థన చేసిన
శోధనలన్నియు తప్పించెదవు (2) 
నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై 
రారాజుగా దిగి వచ్చెదవు (2)
 రారాజుగా దిగి వచ్చెదవు || నా యేసయ్యా ||

Post a Comment

0 Comments