101.Kaluvarigirilo Siluvadariai|కలువరిగిరిలో సిలువధారియై|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : కలువరిగిరిలో సిలువధారియై 
వ్రేలాడితివా నా యేసయ్యా ||2||

1. అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా ||2|| 
నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా 
నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా ||2||
 || కలువరిగిరిలో ॥

2.దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను 
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను ||2|| 
ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి 
నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా ||2|| 
|| కలువరిగిరిలో ||

Post a Comment

0 Comments