102.Nee Mukamu Manoharamu|నీ ముఖము మనోహరము|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన

1. నీవే నాతోడువై నీవే నాజీవమై - 
నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై 
అణువణువున నీకృప నిక్షిప్తమై - 
నను ఎన్నడు వీడని అనుబంధమై || యేసయ్య ||

2. నీవే నా శైలమై నీవే నాశృంగమై - 
నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై- 
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు ॥యేసయ్య ||

3. నీవే వెలుగువై నీవే ఆలయమై - 
నా నిత్యత్వమునకు ఆద్యంతమై 
అమరలోకాన శుద్ధులతో పరిచయమై - 
నను మైమరచి నేనేమి చేసేదనో || యేసయ్య ||

Post a Comment

0 Comments