78.Sarvanga Sundara|సర్వాంగ సుందరా|Song Lyrics in Telugu|Hosanna Ministries|Old Songs

పల్లవి : సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా 
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా 
పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద

1. నా ప్రార్ధన ఆలకించు వాడా నా కన్నీరు తుడుచు
వాడా
నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై 
నాకు తోడై నిలిచితివా || సర్వాంగ ||

2.నా శాపములు బాపి నావా నా ఆశ్రయ పురమైతివా 
నా నిందలన్నిటిలో యెహోషపాతువై
నాకు న్యాయము తీర్చితివా || సర్వాంగ ||

3.నా అక్కరలు తీర్చి నావా - నీ రెక్కల నీడకు చేర్చి
నావా
నా అపజయములన్నిటిలో యెహోవ నిస్సివై
నా జయ ధ్వజమైతివా || సర్వాంగ ||

Post a Comment

0 Comments