నీ కృప లేనిదే నే బ్రతుకలేను
1.జలరాసులన్ని ఏకరాశిగా - నిలిచిపొయెనే నీ జనుల ఎదుట
అవి భూకంపాలే యైనా - పెను తుఫానులే యైనా
నీ కృపయే శాసించునా - అవి అణగి పోవునా
||నీ కృపా||
2.నా జన్మభూమి వికటించగా - మారిపోయెనే మరుభూమిగా
నీ కౌగిలి నను దాచెనే - నీ త్యాగమే నను దోచెనే
నీ కృపయే నిత్యత్వమా - నీ స్వాస్థ్యమే అమరత్వమా ||నీ కృపా||
3.జగదుత్పత్తికి ముందుగానే - ఏర్పరచుకొని నన్ను
పిలచితివా
నీ పిలుపే స్థిరపరచెనే - నీ కృపయే బలపరచెనే
నీ కృపయే ఈ పరిచర్యను - నాకు అనుగ్రహించెను
||నీ కృపా||
0 Comments