మధురమైన నీ నామమునే (2)
మరువక ధ్యానించెద ప్రభువా
1. ఆత్మ నాథా అదృశ్య దేవా
అఖిల చరాలకు ఆధారుండా (2)
అనయము నిను మది కొనియాడుచునే
ఆనందింతు ఆశ తీర (2) ॥ ఆనందింతు ||
2.నాదు జనములు నను విడచినను
నన్ను నీవు విడువకుండా (2)
నీ కను దృష్టి నాపై నుంచి
నాకు రక్షణ శృంగమైన (2) || ఆనందింతు ||
3.శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు
మేఘమందు రానైయున్న (2)
ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు
అంతం వరకును భద్రపరచుము (2) ॥ఆనందింతు||
0 Comments