45.Nityudagu Na Thandri|నిత్యుడగు నా తండ్రి|Song Lyrics In Telugu|Hosanna Ministries|Old Songs

పల్లవి : నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము తరతరముల నుండి ఉన్నవాడవు 
ఆది అంతము లేని ఆత్మా రూపుడా 
ఆత్మతో సత్యముతో అరాధింతును 
నిత్యుడగు నా తండ్రి

1.భూమి ఆకాశములు గతించినా 
మారనే మారని నా యేసయ్యా 
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా ॥ నిత్యుడగు ॥

2.సిలువలో నీవు కార్చిన రుధిరధారలే 
నా పాపములకు పరిహారముగా మారెనులే
కొనియాడి పాడి నేను  నాట్యం చేసెద 
॥ నిత్యుడగు ॥

3. నూతన యెరూషలేముకై సిద్ధపదెదను 
నూతన సృష్టిగా నేను మారెదను 
నా తండ్రి యేసయ్యా ఆత్మదేవ స్తోత్రము 
॥ నిత్యుడగు ||

Post a Comment

0 Comments