43.Prabuva Nee Samukamu|ప్రభువా - నీ సముఖము|Song Lyrics in Telugu|Hosanna Ministries|Old Songs

పల్లవి : ప్రభువా - నీ సముఖము నందు 
సంతోషము - కలదు 
హల్లెలూయా సదా - పాడెదన్

1. పాపపు ఊబిలో నేనుండగా 
ప్రేమతో - నన్నాకర్షించితిరే 
కల్వారి రక్తంతో - శుద్ధి చేసి 
రక్షించి పరిశుద్దులతో నిల్పి ॥ ప్రభువా ॥

2. సముద్ర - తరంగముల వలె 
శోధనలెన్నో- ఎదురైనను 
ఆదరణ కర్తచే - ఆదరించి 
నీ నిత్య కృపలో - భద్రపరచి ॥ ప్రభువా ॥

3.సౌందర్య సీయోన్ని - తలంచగా 
ఉప్పొంగుచున్న - హృదయముతో 
ఆనందమానంద మానందమాని 
ప్రియునితో నేను పాడెదను ॥ ప్రభువా ॥

Post a Comment

0 Comments