పల్లవి : శాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో- కానుకనైతిని
నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తలంచగా
1.నా హృదయమెంతో - జీవము గల దేవుని
దర్శించ ఆనందముతో కేకలేయుచున్నది
నా దేహమెంతో నీకై ఆశించే ॥ శాశ్వత ॥
2.భక్తిహీనులతో - నివసించుట కంటెను నీ
మందిరావరాణములో ఒక్కదినము గడుపుట
వేయిదినాల కంటే శ్రేష్ఠమైనది ॥ శాశ్వత ॥
3.సీయోను శిఖరాన - సిలువ సితారతో
సింహాసనం ఎదుట క్రొత్తపాట పాడెద
సీయోను రారాజువు నీవెగా ॥ శాశ్వత ॥
0 Comments