Naa Praana Priyudavu|నా ప్రాణ ప్రియుడవు|Song Lyrics

పల్లవి : నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణ నాధుడ 
నీవే 
ఎవ్వరు లేరు నాకిలలో - నీవే నాకు సర్వము
నా దేవా నా ప్రభువా - యేసు ||నా ప్రాణ ||

1.గాఢాంధ కారములో - నీవే నాకు దీపము 
భీకర తుఫానులో - నీవే నాకు దుర్గము
||నా ప్రాణ ||

2. చీకు చింతలలో - కృంగి నేనుండగా 
నా చెంతకు చేరి - నా చింతలు బాపితివే ||నా ప్రాణ ||

Post a Comment

0 Comments